ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవల ఈ కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఆర్జీవీని దోషిగా తేలుస్తూ, మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఆరేళ్ల కిందట జరగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్టీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
రాంగోపాల్ వర్మపై ముంబైలో 2018లో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ.. వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లడం జరగ లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాగా ఫామ్‌లో ఉన్న ఆర్జీవీ ఈ మధ్యకాలంలో నాసిరకం సినిమాలు చేస్తూ వరుస ప్లాఫులు మూటగట్టుకున్నారు. పైగా ఆర్టీవీ ఏం ట్వీట్ చేసినా.. ఏం మాట్లాడినా.. అదో సన్సేషన్ అవుతుంది. ఇలా ఆర్జీవీ చేసే సినిమాలు హిట్, ప్లాఫ్‌లకన్నా కూడా తన మాటల తూటాలతో ఎక్కువగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.
అయితే తాజాగా తన ప్రవర్తన పట్ల, తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘సత్య’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ‘సత్య’ప్రమాణంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో ‘సిండికేట్’ పేరుతో రామ్‌గోపాల్‌వర్మ కొత్త మువీ తీస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన ఈ కొత్త మువీలో ఎవరు నటించబోతున్నారు.. దీని కథ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.