రేఖ.. అందం, అభినయంతో వెండితెరపై ఊర్రుతలూగించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. అయితే 1980లు, 1990ల ప్రారంభంలో ఆమె హిందీ సినిమా ప్రముఖ తారలలో ఒకరు. ఖుబ్సూరత్ (1980)లో ఆమె నటనకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆమె బసేరా (1981), ఏక్ హి భూల్ (1981), జీవన్ ధార (1982), అగర్ తుమ్ నా హోతే (1983) చిత్రాలతో మరింత జనాదరణ పొందింది.
అయితే ‘ఖున్ భారీ మాంగ్’ సినిమాలో కూడా రేఖ పవర్ ఫుల్ పాత్రలో నటించింది. ఇప్పటికీ చాలా మందికి ‘ఖున్ భారీ మాంగ్’ సినిమా గుర్తుండే ఉంటుంది. నటుడు కబీర్ బేడీ ఈ చిత్రంలో రేఖతో కలిసి స్క్రీన్‌ను పంచుకున్నారు. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కబీర్ బేడీ రేఖను మొసలి నోట్లోకి నెట్టాడు. ఆ సన్నివేశాన్ని అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. గతంలో కబీర్ బేడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”అప్పట్లో నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా.
అప్పుడే రాకేశ్ రోషన్ ఫోన్ చేసి నేను ఓ సినిమా చేస్తున్నాను.. నిన్ను హీరోగా అనుకుంటున్నాను అని చెప్పాడు. సినిమాలో హీరో విలన్ గా ఉంటాడని చెప్పాడు. ఈ పాత్ర ఎవరికి చెప్పినా రిజెక్ట్ చేస్తున్నారని అన్నాడు. ఎవరికైనా విలన్ పాత్ర ఇస్తే సంతోషిస్తాను.. కానీ ఈ సినిమాలో హీరోతోపాటు విలన్ గా కూడా చేయగలిగేది నువ్వే అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ఎవరని అడిగితే రేఖ పేరు చెప్పారు. వెంటనే ఓకే చెప్పాను. సినిమాల్లో పనిచేయాలని అమెరికా నుంచి ఇండియాకు వచ్చాను.
రేఖను మొసలి నోట్లోకి తోసేసే సీన్ చేశాము. ఆ తర్వాత నేను మళ్లీ హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు వెళ్లిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 1988లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం రేఖ, కబీర్ బేడీల బాలీవుడ్ కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేసింది. ఆ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.6 కోట్లు వసూలు చేసింది.