భర్తతో విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ లేడీ అసిస్టెంట్, వెలుగులోకి షాకింగ్ విషయాలు.

divyaamedia@gmail.com
2 Min Read

సినిమా సంగీత ప్రపంచంలో జగజ్జేత.. ఆస్కార్‌ అవార్డ్ విన్నర్‌.. ఏఆర్‌ రెహమాన్‌ ఇప్పుడు ఇంటిగుట్టు రట్టయ్యి.. బైటికి మొహం చూపించుకోలేని సిట్యువేషన్‌లో పడ్డారు. ఐదు పదులు దాటినా.. రాత్రి 12 గంటలకు బైక్ మీద లాంగ్‌ రైడ్లు వెళ్లే ఈ లవబుల్ పెయిర్ ఇప్పుడు సడన్‌గా బ్రేకప్ ఐంది. మా పెళ్లి కథకు ఇక్కడితో ఫుల్‌స్టాప్.. ఇకపై మేమిద్దరం ఎవరికివారే యమునాతీరే.. అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఏఆర్ రెహమాన్ అండ్ హిజ్ వైఫ్ సైరాబాను. వీళ్లిద్దరూ పరస్పర అంగీకారంతోనే వీడిపోతున్నారు.. అంటూ వాళ్ల లాయర్ లాయర్‌ వందనా షా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

”ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉంది.. వారి బంధంలో ఎమోషనల్ ప్రెజర్స్‌ చాలా ఉన్నాయి. అందుకే ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారు”.. అనేది వీళ్ల విడాకుల పత్రం సారాంశం. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెహమాన్ ట్రూప్ లో బాస్ ప్లేయర్‌గా పని చేస్తోన్న లేడీ అసిస‍్టెంట్ మోహిని డే కూడా విడాకులు తీసుకుంది. ఆమె సంగీత స్వరకర్త మార్క్‌ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెహమాన్ విడాకుల ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మోహిని ఈ ప్రకటన చేసింది. అయితే ఇద్దరూ ఒకే రోజు విడాకులు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

విడాకుల గురించి మోహిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘మార్క్, నేను బాధాతప్త హృదయాలతో విడిపోతున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని తన సోషల్ మీడియా పోస్టులో కోరింది రెహమాన్ శిష్యురాలు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత కూడా మార్క్ తో కలిసి వ్యక్తి గతంగా పనిచేస్తానని పేర్కొంది మోహిని. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేసింది మోహిని.

రెహమాన్ నిర్వహించిన 40కి పైగా షోలలో పనిచేసింది మోహిని. కోల్ కతాకు చెందిన ఆమె యవసు ఇంకా ఇంకా 29 ఏళ్లు. ప్రస్తుతం, విడాకులు ప్రకటించిన పోస్ట్‌కు వారు కామెంట్ ఆప్షన్‌ను ఇవ్వలేదు. రెహమాన్ విషయానికి వస్తే, సైరా బానుతో అతని వివాహం 1995లో జరిగింది. అంటే ఇద్దరికీ పెళ్లయి 29 ఏళ్లు అయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *