బిగ్ బాస్ లోకి వెళ్లిన రీతూ చౌదరి తన గ్లామర్ తో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్టు ఇద్దరితో హౌస్ లో ప్రేమాయణం నడిపిస్తూ హౌస్ లో హైలెట్ గా ఉండటమే తన లక్ష్యం అనేలా నిలుస్తుంది. అయితే కొద్దిరోజుల క్రితమే తన భర్త టాలీవుడ్ హీరో ధర్మమహేశ్ వరకట్నం కోసం వేధిస్తున్నాడని, మరో అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఆ సమయంలో ఆ యువతి పేరు గౌతమి వెల్లడించలేదు. అయితే ఇప్పుడు కొన్నిఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. అందులో బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భర్తతో రిలేషన్ షిప్‌లో ఉండింది రీతూ అనే అర్థం వచ్చేలా ఫొటోలు, వీడియోలను గౌతమి విడుదల చేసింది. ధర్మ మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి 2023లో గర్భం దాల్చింది.
అయితే ఇదే సమయంలో తన భర్త రీతు చౌదరితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడని గౌతమి ఆరోపించింది. ఆమె కారణంగానే తనతో గొడవులు పెట్టుకున్నట్లు కొన్ని సాక్ష్యాలను గౌతమి షేర్ చేసింది. రీతూ గురించి అడగటం వల్లే తనను దూరం పెడుతున్నావ్ అంటూ ఆమె పంపిన మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ ను ఇందులో మనం చూడొచ్చు.
దీని తర్వాత రీతూ, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్లే వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది. అయితే వీరు నిజంగానే రిలేషన్ షిప్ లో ఉన్నారా? లేదా? కేవలం డ్రగ్స్ తీసుకునేందుకే కలిసారా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ధర్మ మహేష్ విషయానికి వస్తే.. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
2023లో వారికి బాబు జన్మించారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ ధర్మ మహేష్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి. ఇప్పుడు ఏకంగా సంచలన వీడియోలు విడుదల చేసింది. మరి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందో చూడాలి.