నిన్న టెనెంట్స్లో ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం ఒక టాస్క్ ఇచ్చాడు. ఈసారి టెనెంట్స్ గ్రూప్ కోసం కాకుండా తమ కోసం టాస్క్ ఆడాల్సి ఉంటుంది అని అనౌన్స్ చేశాడు. ఎవరైతే గెలుస్తారో వారు టెనెంట్ నుంచి ఓనర్ గా మారిపోతారు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ దాంతో సెలబ్రెటీలంతా సిద్ధమయ్యారు. అయితే దీనికి కారణం రీతూ చౌదరినే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రీతూ పట్టుబట్టి మరీ పవన్ ను గెలిపించిందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్లని ఎంచుకోడానికి ముందే.. రీతూకి డిమోన్ పవన్ కి మధ్య ఓ సీరియస్ డిస్కషన్ జరిగింది. ‘నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలని రీతూ కోరడం.. దీనికి ‘నీకోసం ట్రై చేస్తా’ అని డిమాన్ రీతూ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మాటివ్వడం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ కెప్టెన్సీ టాస్క్ కు రీతూనే సంచాలక్ గా సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక టాస్క్ మొదలైనప్పటి నుంచే పవన్ కే సపోర్ట్ ఇస్తూ కనిపించింది రీతూ.
వాస్తవానికి ఈ టాస్క్ లో భరణి అద్భుతంగా ఆడాడు. అతనే విజేతగా నిలవాలి. కానీ రెండవ రౌండ్ లో రీతూ చౌదరి తానూ ఆపండి ఆపండి అని మూడు సార్లు అరిచినా భరణి ఆగలేదని అతన్ని గేమ్ నుంచి తొలగించింది. బజర్ మోగే వరకు గేమ్ ని ఆపకూడదు అనే రూల్ ఉంది. కానీ భరణి విషయం లో మాత్రం ఈ రూల్ ని అనుసరించలేదు రీతూ. పవన్ కోసం భరణిని గేమ్ నుంచి తొలగించి షాక్ ఇచ్చింది.
భరణి లాగే డిమాన్ పవన్ కూడా ఈ టాస్క్ లో చాలా తప్పులు చేశాడు. ఇమ్మానుయేల్ కూడా పొరపాటు పడ్డాడు. కానీ రీతూ మాత్రం భరణిని ఎలిమినేట్ చేసింది. చివరకు ఇమ్మాన్యుయేల్ కూడా ఓడిపోగా డిమాన్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ టాస్క్ చూస్తున్న ఆడియన్స్ అందరూ రీతూ దగ్గరుండి డిమాన్ ను గెలిపించిందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆది రెడ్డి కూడా ప్రస్తావించాడు. ‘ఇదమ్మా నీ అసలు స్వరూపం’ అంటూ జబర్దస్ట్ నటిపై విరుచుకుపడ్డాడు.
డిమాన్ పవన్ ను గెలిపించడానికి రీతూ తొండాట ఆడిందని ఆది రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. చాలా మంది అభిమానులు కూడా రీతూ ఆట తీరును తప్పుపడుతున్నారు.
Bharani garu 3 times poosaru anta 😒
— Vaani Batra 🎀 (@____Chipichipi_) September 18, 2025
Mari Demon em chesadu pulihora kalipadu ah last lo 😢#BiggBossTelugu9 pic.twitter.com/nQvlnpDmc2