అన్న శవాన్ని కూడా వదలకుండా రీల్స్ చేసిన చెల్లెలు..! రీల్స్ పిచ్చి ఇలా ఉంటుందా..?

divyaamedia@gmail.com
2 Min Read

ప్రస్తుతం రీల్స్ రూపొందించడం అనేది ఓ పెద్ద వ్యాధిలా మారిపోయింది. రీల్స్ కోసం ఎన్నో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ క్రమంలో తామే ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చనిపోయిన సొంత సోదరుడిని కూడా వదల్లేదు ఓ చెల్లులు. అతని మృతదేహంపై కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది ఆ చెల్లెలు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోదరుడి మృతదేహం వెనుక పడి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అతని భార్య బిగ్గరగా ఏడుస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం మనిషి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నయో ఆందోళన కలిగిస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ మహిళపై దుర్భాషలాడుతున్నారు. ఈ మహిళ తన సోదరుడి మరణంపై రీల్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి ఎంత దూరం వెళ్లగలరో నిరూపించింది.

ఆ వీడియో చూసి జనాలకు కోపం రావడం సహజం.. ఎందుకంటే దుఃఖించే సమయాన్ని ఇలా వాడుకోవడం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో గది లోపల మృతదేహాన్ని ఉంచారు. అక్కడే కూర్చున్న అతని భార్య గట్టిగా ఏడుస్తోంది. మృతుడి సోదరి ఆమె పక్కనే కూర్చుని ఉంది. గదిలో మరో మహిళ కూడా ఉంది. ఇంతలో, రీల్ షూట్ చేస్తూ, మృతుడి సోదరి స్థానిక భాషలో, భాబీ, ఏడవకండి. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఒక వ్యక్తికి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటూ ఓదార్చుతూ కనిపింది.

జనవరి 16న @noble_mobile_shopee Insta హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ని చూసిన నెటిజన్లు చాలామంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొంతమంది వినియోగదారులు దీనిని మానసిక దివాళా తీశారని, సదరు మహిళపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *