ఆకుకూరల మాదిరిగానే తోటకూరలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సి, బిలు అధికంగా లభిస్తాయి. వీటితో పాటు సోడియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇకపోతే, ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉన్నాయి.
అయితే ఎర్ర తోటకూర జీర్ణ సమస్యలను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను, మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది. ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది. కంటి ఆరోగ్యానికి ఎర్ర తోటకూర చాలా మంచిది.

కంటి చూపు, కంటి,చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోట కూర సహాయపడుతుంది. గొంతు క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటుంది. సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది. ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. ఎర్ర తోటకూర ఫైబర్‌కి మూలం.
వీటి ఆకులు నుంచి కాండం వరకూ అన్నీ పోషకాలతో వుంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎర్ర తోటకూర తింటే ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, అధిక రక్తపోటు అదుపునకు ఎర్ర తోటకూర తింటే మంచిది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి.. చర్మంపై ముడతలు, మొటిమలను పొగొట్టి ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఉండేలా ఎర్ర తోటకూర చేస్తుంది.
