Ration Cards:రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..ఇక నుంచి అవి కూడా ఉచితంగానే..!
Ration Cards: రేషన్ షాపులు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా సగంపైగా దారి మళ్లుతోంది. దీనిని అడ్డుకట్ట వేసేందుకే ప్రతి ఒక్కరూ తినడానికి అనువుగా ఉండే విధంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Also Read : యూపీఐ ద్వారా డబ్బులు పంపేవారికి మంచి వార్త చెప్పిన RBI.
అయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వచ్చే సంవత్సరం నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సన్న బియ్యం పంపిణీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ.. పలు సూచనలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. చౌక ధర దుకాణాలు మరియు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం….సరఫరా చేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : మీ ఎటిఎం లేదా క్రెడిట్ కార్డ్ పోయిందా..?
అయితే ఇందులో సగం వరకు అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేసింది. రేషన్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఇక ఈ కార్డులను గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన కుటుంబ సర్వే ప్రకారం… ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయానికి వచ్చింది.