రతన్ టాటా కోసం తల్లడిల్లిన పెంపుడు కుక్క గోవా, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!

divyaamedia@gmail.com
2 Min Read

రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కలలో గోవా కుక్క ఒకటి. గోవాలో జరిగిన ఒక సంఘటనతో ఆ కుక్క రతన్ టాటాకు బాగా దగ్గరైంది. వీధుల్లో తిరిగే ఆ కుక్కను టాటా అన్నం పెట్టారు. అప్పటినుంచి రతన్ టాటా వెంటే రావడం చేసింది. దాంతో ఆ కుక్కను రతన్ టాటా దత్తత తీసుకున్నారు. అయితే రతన్ టాటాకు శునకాలంటే అమితమైన ప్రాణం.. గోవా (శునకం) తో రతన్‌ టాటాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఒకసారి రతన్‌టాటా గోవా వెళ్లారు.

ఆ సమయంలో ఈ శునకం ఆయన వెంటే నడవడం ప్రారంభించింది. దీంతో ఆ మూగజీవిని చూసి ముచ్చట పడిన రతన్ టాటా.. దాన్ని దత్తత తీసుకుని గోవా అని పేరు పెట్టారు. అనంతరం ముంబయి తీసుకొచ్చి.. ఎంతో ప్రేమగా చూసుకుటున్నారు. అలా 11 ఏళ్లుగా ఆయనతో పాటు గోవా ఉంటున్నట్లు దాని కేర్‌టేకర్‌ మీడియాకు వివరించారు. టాటాకు మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో చెప్పే ఘటనలు చాలానే ఉన్నాయి.

పెంపుడు కుక్క అనారోగ్యంతో ఉందని కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమాన్ని రతన్ టాటా వాయిదా వేసుకున్నారని.. సుహెల్ సేథ్ అనే వ్యాపారవేత్త తెలిపారు. వ్యాపారాన్ని చూసుకుంటూనే జంతువులపై ప్రేమను చాటుకున్నందుకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించారు. రతన్ టాటా నుంచి తనకు 11 ఫోన్ కాల్స్ వచ్చాయని చివరకు తనను సంప్రదించగా తన పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో ఉందని అందుకే దానిని వదిలి అవార్డు తీసుకోలేనన్నారని సుహెల్ సేథ్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్‌ను అభినందించారన్నారు.

గతంలో ఓసారి వర్షం కురుస్తున్న సమయంలో ‘బాంబే హౌస్‌’ వెలుపల ఓ శునకం గజగజ వణుకుతుండడం చూసి చలించిపోయిన రతన్‌టాటా.. కార్యాలయంలోకి శునకాలను అనుమతించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. బాంబేహౌస్‌ను ఆధునికీకరించినప్పుడు గ్రౌండ్‌ఫ్లోర్‌లో శునకాల కోసం ఓ గదిని కూడా తీర్చిదిద్దారు. ఈ గదిలో ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన శునకాలకు అటెండర్‌ స్నానం చేయిస్తాడు. అనంతరం అవి బంకర్‌ బెడ్‌పై హాయిగా కొద్దిసేపు నిద్రిస్తాయి. కొన్ని శునకాలు శాశ్వతంగా బాంబేహౌస్‌లోనే ఉంటుండగా, మరికొన్ని అప్పుడప్పుడూ వస్తుంటాయని సిబ్బంది చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *