వీల్ చైర్‌లోనే రష్మి, కనీసం స్నానం కూడా చేయలేక .. దారుణంగా యాంకర్ హెల్త్ కండీషన్.

divyaamedia@gmail.com
2 Min Read

స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ బారినపడినట్లుగా బయటపెట్టడంతో పలువురు నటీనటులు తమ ఆరోగ్య పరిస్ధితిని వెల్లడించారు. ముందస్తు కమిట్‌మెంట్స్, బిజీ షెడ్యూల్ కారణంగా వారు కనీసం చికిత్స చేయించుకోవడం కూడా కష్టమే. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ ఆసుపత్రి బెడ్‌పై ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. అయితే గత నెలలోనే రష్మీకి ఆపరేషన్ జరిగింది. భుజం నొప్పి ఎక్కువయ్యేసరికి సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది.

అంతేకాదు వైద్యుల సూచనల మేరకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వీడియోలో తెలిపింది. అయితే ఉన్నట్లుండి అందరికీ షాక్ ఇచ్చింది అందాల యాంకరమ్మ. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరగ్గా.. వారం రోజులు కూడా తిరగకుండానే ఏప్రిల్ 24న బాలి వెకేషన్ కు వెళ్లిపోయింది రష్మి. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్మీ ఇంత త్వరగా ఎలా రికవరీ అయ్యిందా? అని ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ బాలి ట్రిప్ ప్లాన్ రెండు నెలలకు ముందే ఫిక్స్ అయ్యిందట.

దీనికి తోడు తన పుట్టిన రోజు. అందుకే అనారోగ్యంతో ఉన్నా ట్రిప్ క్యాన్సిల్ చేయకుండా తప్పక బాలి వెళ్లాల్సి వచ్చిందని రష్మీ తెలిపింది. కాగా వెకేషన్ కు వెళ్లినా అక్కడ కనీసం నడవలేకపోయిందట ఈ యాంకరమ్మ. దీంతో వీల్ ఛైర్ లోనే తిరుగుతూ బాలి ట్రిప్ పూర్తి చేసిందట. ఈ విషయాన్ని చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది రష్మీ. ‘ట్రిప్ కి వెళ్లానన్న మాటే గానీ.. అక్కడ ఊయల ఊగడం, జంపింగ్ లు, డైవింగ్ చేయడం, ఇసుకలో ఆడుకోవడం, వాటర్ రైడ్స్ చేయడం, డ్యాన్సింగ్ లాంటివి చేయలేదు. కనీసం చివరకు బీచ్ లో స్నానం కూడా చేయలేకపోయాను.

ఈ ట్రిప్ కి వెళ్లడం ఏమో గానీ అమ్మ నన్ను జీవితాంతం దెప్పిపొడవడం గ్యారంటీ’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిన చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *