రష్మిక.. పుష్ప1, పుష్ప2తోపాటు అంతకుముందు విడుదలైన యానిమల్ చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోయిన్ గా చెలామణి అవుతోంది. తన కెరీర్ లో భాగంగా ఎన్నో మంచి సినిమాలు చేసింది. జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది.. విజయాలు సాధిస్తుంది. ఆకట్టుకునే రూపంతోపాటు చక్కని ఛాయతో మెరిసిపోయే రష్మిక ప్రస్తుతం ఒకరకమైన చర్మవ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది.
అయితే రష్మిక నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుంది. అయితో తాజాగా రష్మికకు సంబంధించిన ఏ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనకు ఓ చర్మవ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేకప్ వేసుకునే కాస్మెటిక్స్‌లో అనేక రసాయనాలు కలుపుతారు. మేకప్ వేసుకుంటే చర్మంపై తరుచుగా మంట రావడంతో పాటు దద్దుర్లు రావటం, ఎర్రగా అవుతుందంట.
దీంతో డర్మటాలజీస్ట్ను కలిసినప్పుడు ఈ వ్యాధి ఉన్నట్లు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది . షూటింగ్ జరిగే సమయంలో లైట్స్ వేడికి మేకప్ కరుగుతుంటుంది. రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వాడటం వల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత జుట్టు రాలటం, చర్మం పొలుసుల్లా అవటం జరుగుతుంది. దీన్ని సోరియాసిస్ అంటారు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడని చెబుతున్నారు వైద్యులు. దీనిపై ఇప్పటికీ రష్మిక కానీ, ఆమె టీం కానీ స్పందించలేదు. ప్రస్తుతం రష్మిక పలు సినిమాల్లో నటిస్తోంది.