గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఈ ఇద్దరు సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని ఆడియన్స్ కి షాక్కిచ్చారు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ జంట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2026 ఫిబ్రవరిలో వీరి పెళ్లి ఘనంగా జరుగనుందని టాక్. అయితే రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి కీ రోల్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే అక్టోబర్ 25న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది రష్మిక. అయితే, మీడియా నుంచి వస్తుంది అనుకున్న ప్రశ్న యాంకర్ నుంచి వచ్చింది.

ముందుగా యాంకర్.. ఒక వ్యక్తిని బాయ్ ఫ్రెండ్‌గా ఎంచుకోవాలని ఎలా జడ్జ్ చేయాలని అని అడుగుతుంది. దానికి ప్రేక్షకుల నుంచి.. విజయ్ దేవరకొండని అడిగితే చెప్తారని అనే కామెంట్ వచ్చింది. దానికి రష్మిక కూడా నవ్వుతూ నవ్వుతు సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తరువాత రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అని యాంకర్ మరో ప్రశ్న అడిగింది.
దానికి మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ(విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తి అనే ఆన్సర్ వచ్చింది. అప్పుడు కూడా రష్మిక చిరునవ్వుతూ.. అందరికీ తెలుసు.. అంతే.. అంతే.. అనుకుంటూ చేయి ఊపుతూ కనిపించింది. దీంతో, విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ గురించి చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
