మౌనీ అమావాస్య అమృత స్నానానికి పదికోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక ఘటన స్థలానికి అంబులెన్సులు వచ్చాయి. గాయపడిన వారిని కుంభమేళా సెక్టార్ 2 కు తరలించారు. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈరోజు అమృత స్నానం కేన్సల్ చేసినట్లు అఖారా పరిషద్ (కౌన్సెల్) ప్రకటించింది. అయితే ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరికి, ఏ వయస్సులో కలుగుతుందో చెప్పలేం. ప్రేమలో పడినప్పుడు మనిషికి ప్రపంచం మరింత రంగులమయంగా కనిపిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రేమికులు.
తాజాగా మహా కుంభమేళాకు వచ్చిన ఓ జంట వీడియో వైరల్ అవుతోంది. ఒక అఘోరి, రష్యన్ మహిళా ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రష్యన్ మహిళా అఘోరి ప్రేమలో పడి, తన దేశాన్ని విడిచి భారతదేశంలోనే స్థిరపడిపోయింది. ఈ అఘోరి-రష్యన్ ప్రేమకథ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల ప్రకారం.. భారతదేశం చుట్టడానికి వచ్చిన ఈ రష్యన్ మహిళ ఒక అఘోరి బాబాతో ప్రేమలో పడింది.
అటు తర్వాత తన దేశం రష్యాను విడిచి, అఘోరి బాబాతో వివాహం చేసుకుని భారతదేశంలో స్థిరపడింది. ఇప్పుడు ఆమె అఘోరి బాబాను తన భర్తగా ప్రకటిస్తోంది. అఘోరి బాబాను, “రష్యన్ కారణంగా మీ తపస్సు అంతరాయం కలిగిందా?” అని ప్రశ్నించగా, బాబా చిరునవ్వు ఇచ్చి సమాధానం చెప్పారు. ఈ కథానాయకురాలైన రష్యన్ మహిళ తన దేశాన్ని విడిచి భారతదేశంలో స్థిరపడడం, హిందూ ధర్మాన్ని స్వీకరించి అఘోరి బాబాతో వివాహం చేసుకోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ మహిళ తన ప్రేమ కోసం గణేశుడి టాటూను కూడా తన వీపుపై వేయించుకుంది. ప్రేమతో ఆమె సంస్కృతి, మతం మార్పును స్వీకరించింది. ఇప్పుడామె ఇతరులకు కూడా హిందూ ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తోంది.