చావా ట్రైలర్ ఇటీవల ముంబై వేదికగా జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక మాట్లాడుతూ.. మూవీలో ఏసుబాయ్ లా చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే రష్మిక మందన్న హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసింది. ఇక యానిమల్ సినిమాతో సంచలన విజయం అందుకుంది. హిందీ నిర్మాతలు రష్మిక కాల్షీట్ కోసం రేసులో ఉన్నారు.
ఇప్పుడు ఈ బ్యూటీ విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమా చేసింది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది. ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ.. సౌత్ నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ కావడం అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పాను’ అని రష్మిక తెలిపింది.
చావా ట్రైలర్ నన్ను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు అని తెలిపింది రష్మిక. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. చావా తర్వాత రిటైర్ కావడం అవ్వాలనిపించిందని దర్శకుడితో చెప్పాను అని రష్మిక తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.