పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ మాత్రం చాలా చాలా తక్కువ . అందులో టాప్ పొజిషన్ లో ఉన్నది రష్మిక మందన్నా. మొదటగా ఆనిమల్ ఆ తర్వాత పుష్ప2.. ఆ తర్వాత ఛావా .. ఇలా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని సినిమా ఇండస్ట్రీలో చెరగని రికార్డును ఆమె సొంతం చేసుకుంది . అయితే సాధారణంగా సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు.
ఎంతగా తినాలనిపించినా సరే సినిమాల కోసం నోరు కట్టుకొని మరీ హెల్దీ డైట్ ఫాలో అవుతారు. టైమ్ కి తినడమే కాదు వర్కౌట్స్ కూడా చేస్తూ సన్నజాజి తీగల్లా మెరిసిపోతారు. అయితే అప్పుడప్పుడు చీట్ డైట్ పేరుతో తమకు ఇష్టం వచ్చినవి లాగించేస్తారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక మందన్న మాత్రం ఏకంగా ఉదయం 4 గంటలకే ఫుడ్ తింటుందట. రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేసే నటీనటులు డైట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే.

కానీ ఉదయాన్నే లేచి, వర్కౌట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. రష్మిక మాత్రం తెల్లవారుజామున 4 గంటలకు మ్యాగీని లాగిస్తున్న ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక తాను అలా ఉదయాన్నే స్నాక్స్ లేదా చిరు తిండి తినడం గురించి వెల్లడించింది. బౌల్స్ లో మ్యాగీ ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసి, “ఉదయం 4 గంటల స్నాక్” అని దానికి క్యాప్షన్ ఇచ్చింది.
అయితే రాత్రిళ్ళు లాంగ్ నైట్ షూటింగ్ ఉన్నప్పుడు ఆమె ఇలా స్నాక్స్ లాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడుతుందట. ఇది షూటింగ్ ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది అనేది రష్మిక ఉద్దేశమట. అలా రష్మిక మందన్న తనకున్న వింత అలవాటును బయట పెట్టింది.