తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. అయితే ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది.
రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్ జేడీ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అంతేకాదు..అప్పట్లోనే గ్లామర్ రోల్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ వయ్యారి భామ. అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ.. నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు.
అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయర్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్.
రంభను కన్ఫార్మ్ చేసి డైట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్మ కావలాని పట్టుబట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందట. కానీ డైరెక్టర్ ఈవీవీ కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.