తెలుగు సీనియర్ నటి రమా ప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి కుమారుడు సురేష్ ఆకస్మికంగా మరణించారు. ఇటీవలే తీవ్ర అస్వస్ధతకు గురైన సురేష్ బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన ప్రాత్లోల నటించి ప్రేక్షకులను మెప్పించారు రమాప్రభ.
కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ కొన్ని సినిమాల్లో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇండస్ట్రీలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి స్టార్ కమెడియన్లతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రమాప్రభ. పూరీ జగన్నాథ్ మూవీస్ లో ఎక్కువగా కనిపించారు. తాజాగా రమాప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి కుమారుడు సురేష్ ఆకస్మికంగా కనుమూశారు.

ఈ మధ్యనే ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు (38) గాయత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని పరామర్శించడానికి రమాప్రభ వచ్చారు.గాయత్రికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. గత తొమ్మిది నెలలుగా సురేష్ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. రమాప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘అప్పుల అప్పారావు’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు సురేష్. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.