Ram Gopal Varma | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లని కించపరిచే విధంగా రామ్‌గోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టాడని మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితం మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మద్దిపాడు పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.
విచారణకు హాజరు కావాలంటూ వర్మకు నోటీసులు అందించారు.ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు. అయితే తాను షూటింగ్లో ఉన్నానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ ఈ మేరకు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు,