రామ్చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. అయితే రామ్ చరణ్ ఇప్పటివరకు ఎంతో మంది అందాల తారలతో రొమాన్స్ చేశాడు.
నేహా శర్మ, కాజల్ అగర్వాల్, జెనీలియా, తమన్నా, అమలా పాల్, శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, పూజా హెగ్డే వంటి ఎందరో అందాల తారలు చరణ్ తో కలిసి నటించారు. ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ, అమీ జాక్సన్, అలియా భట్ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం మెగా పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం రామ్ చరణ్ కు భార్యగా, తల్లిగా నటించింది.
అంతేకాదు ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు తెలుగమ్మాయి అంజలి. రామ్ చరణ్ హీరోగా సౌతిండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.
విలన్ గా ఎస్ జే సూర్య మరో కీలక పాత్రలో మెరిశాడు. శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా, అలాగే అభ్యుదయం పార్టీ లీడర్ అప్పన్నగా రెండు పాత్రల్లో జీవించేశాడు చరణ్. ముఖ్యంగా ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో అప్పన్న ఎపిసోడ్ గేమ్ ఛేంజర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక్కడ అప్పన్నకు భార్యగా అంజలి అద్భుతంగా నటించింది.
భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలిచే పార్వతి పాత్రలో ఆమె నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొడుకు రామ్ చరణ్ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే తల్లిగా అంజలి నటన విమర్శకలు ప్రశంసలు అందుకుంది. అలా తండ్రి రామ్ చరణ్ కు భార్యగా, కొడుకు రామ్ చరణ్ కు తల్లిగా అంజలి నటించింది. కాగా ప్రస్తుతం అంజలి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.
