ఇండియన్ సినిమా రంగంలో ఫిట్‌నెస్‌పై అత్యంత శ్రద్ద చూపే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్. అమె తన బాడీని ఫిట్‌గా ఉంచుకొనేందుకు నిరంతరం ఆమె జిమ్ వెళ్తూ కనిపిస్తుంటుంది. పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా వెయిట్స్, ఎరోబిక్స్, వర్కవుట్ చేస్తూ వీడియోలు పెడుతుంటుంది. ఆమె పడే కష్టానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అయితే ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గాయపడింది. రకుల్ బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు తీస్తోంది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయమైంది. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డాడు తెలుస్తోంది. జిమ్ లో 80 కిలోల డెడ్ లిఫ్ట్ చేస్తుండగా రకులు వెన్నుకు గాయమైంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 ఉదయం రకుల్ తన వ్యాయామం చేస్తున్నప్పుడు గాయమైనట్లు తెలుస్తోంది. ఆమె బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయగా దాని ఫలితంగా వెన్నునొప్పి వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అయినప్పటికీ, ఆమె వరుసగా రెండు రోజులు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది. 3 రోజులు నొప్పితో బాధపడిన తర్వాత, ఆమె ఫిజియోను కలిశారని అంటున్నారు. అయితే ప్రతిసారీ నొప్పి 3-4 గంటల తర్వాత తిరిగి వస్తుందని అంటున్నారు. చివరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. బెల్ట్ ధరించకుండా 80 కిలోల బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెన్నెముకలోని ఎల్4, ఎల్5 అలాగే ఎస్1 సమీపంలోని నరాలపై చాలా ఒత్తిడి పడిందని వైద్యులు తెలిపారు.
ఇక 2019లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి సీక్వెల్గా ‘దే దే ప్యార్ దే 2’ తెరకెక్కుతోంది. 2025 మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీత్ సింగ్ 2009లో ‘గిల్లి’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత పలు తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.