ఈ ఏడాది ప్రారంభంలో తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చారు ధనుష్ దంపతులు. దాదాపు 18 బంధానికి తాము ముగింపు పలుకుతున్నట్లుగా చెప్పడంతో సినీ ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం షాకయ్యారు. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే వీరు విడాకుల తీసుకోవడం అటు ధనుష్ కుటుంబంలోగానీ.. ఇటు రజనీకాంత్ ఫ్యామిలీలో కానీ ఇష్టం లేదట. అయితే రజినీకి ఇద్దరు కూతుళ్లు. సౌందర్య రజినీకాంత్, ఐశ్వర్య రజినీకాంత్. హీరోయిన్స్ గా కాకుండా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిర్మాతలుగా మారారు. కానీ, అందులో ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు.
తండ్రిగా రజినీ.. వారికి తోడుగా ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇక వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ. తాము మాత్రం కలిసేది లేదని నిర్మొహమాటంగా తెలిపారు.
ఇక ఈ ఏడాదిలోనే వీరి విడాకుల కేసు కోర్టుకు వచ్చింది. కానీ, ఆ కేసుకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో మళ్లీ వీరు కలిసిపోనున్నారని వార్తలు వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ధనుష్- ఐశ్వర్య కలిసే ఉంటున్నారట. అంతేకాదు ఈ దీవాళీని కూడా ఈ జంట కలిసే సెలబ్రేట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు కలవడానికి రజినీనే కారణమని అంటున్నారు. ఈ మధ్యనే రజినీ అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. గుండెల్లో ఆయనకు స్టంట్ వేశారు.
ప్రస్తుతం రజినీ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి వచ్చాకా.. ఆయన.. కూతురు అల్లుడు తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కూతురు – అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, అదే తన ఆఖరి కోరిక అని చెప్పడంతో ధనుష్- ఐశ్వర్య కొద్దిగా అలోచించి విడాకులను రద్దు చేసుకోనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ధనుష్- ఐశ్వర్య మళ్లీ జంటగా మీడియా ముందుకు రానున్నారు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.