చెన్నై పోలీస్ లు చెప్పినదానికి ప్రకారం ఆయనకు తీవ్రమైన కడుపులో నొప్పి రావటంతో వెంటనే హాస్పటిల్ లకు తీసుకొచ్చారు. అలాగే తమిళ మీడియా సమాచారం మేరకు డాక్టర్ల టీమ్ ఆయన్ను పర్యవేక్షిస్తోంది. కార్డియాలిజిస్ట్ డా.సాయి సతీష్ సూపర్ వైజన్ లో ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ లు జరగనున్నాయి. అయితే అయితే రజినీకాంత్ 30వ తేదీన గ్రేమ్స్ రోడ్ లో గల అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్త నాళంలోవాపు చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాథటర్ పద్దతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు.
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ ఆర్టా కి స్టెంట్ అమర్చారు. రజినీకాంత్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు.. అని బులెటిన్ లో రాసుకొచ్చారు. 73ఏళ్ల రజినీకాంత్ తరచుగా అనారోగ్యం బారినపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించని కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
త్వరలో పార్టీ ప్రకటన చేస్తారనగా.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఇంటి ముందు ధర్నాలు చేసినా… ఆయన డెసిషన్ మారలేదు. ఆ మధ్య రజినీకాంత్ అమెరికాలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. అయితే రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ హిట్. వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఆయన వేట్టయాన్, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు.
వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకొస్తున్న చిత్రాల్లో ‘వేట్టయాన్’ ఒకటి. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ రన్‌టైమ్ 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు) . మూడు డైలాగులుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్ చేయడమో.. వేరే పదాలు వినియోగించడమో చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది.