చూడటానికి ఇలా ఉన్నాడే కానీ..! ఈ కమెడియన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

divyaamedia@gmail.com
2 Min Read

హీరో సూర్య ‘సింగం 2’ మూవీలో విలన్ క్యారెక్టర్ సహయం అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. మరీంత ఈజీగా చెప్పాలంటే.. విజయ్ దళపతి ‘పోలీసోడు'(తేరి) మూవీలో విజయ్ పక్కనే పోలీసు ఆఫీసర్ రాజేందర్ అన్నా ఇంక ఈజీగా గుర్తుపట్టేస్తారు. మరీ అయినా ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది కదా. రాజేంద్రన్ బక్కగా, గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్ లో స్టంట్‌కు, డూప్‌గా నటించాడు. చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు రాజేంద్రన్.

అయితే 500కు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు. తెలుగు, తమిళ్ సినిమాల్లో ఫైటర్ గా కనిపించాడు. అలాగే పితామగన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత నటుడిగా వరుసగా సినిమాలు చేశాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలోని కళపేటలోఓ సినిమా షూటింగ్ లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడెయ్యాలి.

కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు. అయితే ఆ రసాయనాలు ఉండటంతో.. రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక భవిషత్తులో జుట్టు రాకుండపోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. అలాగే నల్లగా రంగు మారిపోయింది. మొఖం కూడా వింతగా తయారయ్యింది. అలాగే ఆయన రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి.

జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సాయం కూడా చేయలేదట. ఇక ఆ సమస్యలన్నీ దైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. కమెడియన్ గా, నటుడిగా 160కు పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించాడు. అలాగే ఆయన ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఆయనకు ఇప్పుడు చెన్నైలో రూ. 15కోట్ల రూపాయిల ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన దగ్గర మూడు కాస్ట్లీ కార్స్ ఉన్నాయని తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *