Rain Alert: వాతావరణ శాఖ అలెర్ట్, వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
Rain Alert: శుక్రవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్నటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read : తిరుమల వెళ్ళే వారికీ అలెర్ట్, నడకదారిలో మరోసారి చిరుత కలకలం..?
ఈ మేరకు భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చూడండి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది. బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రాయలసీమ :-మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
Also Read : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..ఇక నుంచి అవి కూడా ఉచితంగానే..!
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.