సీనియర్ నటి రాధికా శరత్ కుమార్. తెలుగు, తమిళ మూవీస్‌లో హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో డిఫరెంట్ లుక్‌తో తమిళ మూవీ ‘తాయి కిళవి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్లో లుక్స్‌తోనే భయపెట్టేశారు. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు.
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ సైతం ఒకప్పుడు తోపు హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పుడు సరికొత్త ప్రయత్నం చేస్తుంది. తన కొత్త ప్రాజెక్టులో 75 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమా తాయ్ కిళవి. ఈసినిమాకు కొత్త దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా.. రాధిక శరత్ కుమార్ లుక్స్ చూసి అవాక్కవుతున్నారు అడియన్స్. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించిన రాధిక.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి వినూత్న ప్రయత్నం చేస్తుంది.
