శాండ్‌విచ్‌లు, పాస్తా, రైస్ వంటివి. అయితే, వీటిలో పుట్టగొడుగుల కూర చాలా మందికి ఇష్టమైనది. ఏ రూపంలో తీసుకున్నా, పుట్టగొడుగులు రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది వీటిపై డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. అయితే పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి మంచి మూలం.
వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు చాలా బలంగా మారతాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ డి2, విటిమిన్ డిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. విటమిన్ డి లోపంతో బాధపడేవారికి పుట్టగొడుగులు చాలా మంచిది. పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు.
పుట్టగొడుగుల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఈ ఆహారంలో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ ఉంటాయి.

ఇవి రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. మష్రూమ్స్‌లోని యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో పాటు సెల్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతుంది.
పుట్టగొడుగులని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా మారతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పుట్టగొడుగులు తింటే బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. మెదడు కణాలకు రక్త ప్రసరణ, ఆక్సీజన్ సరఫరా సరిగా జరుగుతుంది.
చికెన్, మటన్ ఇష్టపడని వారు వాటి స్థానంలో పుట్టగొడుగుల్ని తినొచ్చు. మష్రూమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్, దాని నరాలపై ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.