పుతిన్ నడిచేటపుడు కుడిచేయి ఎందుకు కదలదో తెలుసా..? ఆ రహస్యం ఇదే.

divyaamedia@gmail.com
1 Min Read

వ్లదిమిర్ పుతిన్ మొదట్లో రష్యా దేశ భద్రత, విదేశీ నిఘా సంస్థ కేజీబీ అధికారిగా పని చేసేవారు. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడిగా ఆయన ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్నారు. దీంతో పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే నెదర్లాండ్స్‌లోని రాడ్బౌడ్ యూనివర్సిటీలో న్యూరాలజీ ప్రొఫెసర్ బస్టియన్ బ్లోయమ్ దీనిపై పరిశీలన చేశారు.

ఆయన చెప్పినట్టు, ఈ నడకలో కనిపించే కఠినత పార్కిన్‌సన్స్‌లో కూడా క‌నిపిస్తుంది. అయితే పుతిన్‌కు అలాంటి లక్షణాలు కనిపించలేదు. ప‌రిశోధ‌కులు పుతిన్ వీడియోల‌ను ప‌రిశీలించాక ఇది వైద్య సమస్య కాదని స్పష్టమైంది. పరిశోధకులు పాత KGB ట్రైనింగ్ మాన్యువల్స్ పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.

KGB ఏజెంట్లు ఒకప్పుడు పిస్టల్‌ను కుడి చేతిలో ఛాతికి దగ్గరగా పట్టుకుని నడవాలి అని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇలా నడిస్తే శత్రువు ఎదురైతే ఆయుధాన్ని సెకన్లలో తీసి సంరక్షించుకోవచ్చు. కుడి చేయి కఠినంగా ఉంచడానికే ఈ శిక్షణ. వీడియోలు పరిశీలించగా పుతిన్ మాత్రమే కాదు, దిమిత్రి మెద్వెదేవ్, ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు, జనరల్ అనటోలీ సిద్ధారోవ్‌లో కూడా ఇదే తరహా నడక కనిపించింది.

దీంతో ఇది వ్యక్తిగత శైలి కాకుండా, ఆయుధాల శిక్షణ ప్రభావం అని నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రత్యేక నడకకు పరిశోధకులు “గన్స్‌లింగర్ గైట్” అనే పేరు పెట్టారు. దీని అర్థం గన్‌దారుడు నడక. కుడి చేయి ఛాతికి దగ్గరగా ఉంచి, అవసరమైతే వెంటనే గన్ తీసేలా శరీరం సిద్ధంగా ఉంచే నడక. పుతిన్ పాత KGB ఏజెంట్ కావడం వల్ల ఈ శిక్షణ ఇప్పటికీ ఆయన నడకలో స్పష్టంగా కనిపిస్తుందని వారు భావిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *