పూరీ నిర్మాణ సంస్థ అయిన ‘పూరీ కనెక్ట్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మి చూసుకుంటున్నారు. ఇక పూరి జగన్నాథ్ బద్రి సినిమా 2006 దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘పోకిరి’ వంటి సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ చేసి ఐఫా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అయితే పూరిజగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాలు చేస్తున్నారు.
దర్శకుడిగా పూరి వ్యవహరిస్తుంటే.. ఛార్మీ నిర్మాతగా బాధ్యతలు చూసుకుంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాకు కూడా ఛార్మి నిర్మతగా వ్యవహరిస్తోంది. తాజాగా తనతో ఛార్మీకి ఉన్న సంబంధం గురించి పూరిజగన్నాథ్ స్పందించారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఛార్మీ తెలుసు.

గత 20 ఏళ్ల నుండి ఉన్న స్నేహంతో మేము కలిసి పని చేస్తున్నాము” అన్నారు పూరి జగన్నాథ్. నేను 50 ఏళ్ల వయసున్న లేదా లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎటువంటి బాధ ఉండేది కాదు.. ఎలాంటి అనుమానాలు రావు. లేదా ఎవరైనా పెళ్లయిన మహిళతో ఉన్నా కూడా ఇక్కడ ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ ఇక్కడ అందరి సమస్య ఏమిటంటే ఛార్మీ యంగ్.. పైగా ఆమెకు పెళ్లి కాలేదు.
దానితో అందరూ మా మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారండి. పైపై ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు. స్నేహం మాత్రమే శాశ్వతం.. అని పూరి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.