వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో కూడా లైలా సినిమాలో బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం జరిగింది.. ఈ నేపథ్యంలోనే ఆ నటుడు మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదంటూ అటు హీరో, నిర్మాతలు కూడా మీడియా ముందుకు వచ్చి మరి క్షమాపణలు తెలియజేశారు. అలాంటి సమయంలో కూడా సైలెంట్ గా ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు ఒక్కసారిగా హాస్పిటల్ పాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘150 మేకలు.. 11 మేకలు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై వైఎస్సార్ సీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా #BoycotLaila ట్రెండ్ చేస్తోంది. పృథ్వీ కామెంట్స్ కు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినా ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఆగడం లేదు. ఇప్పటికే ఈ BoycotLaila పేరుతో లక్ష ట్వీట్స్ వచ్చాయి. పృథ్వీనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రచ్చ ఇలా కొనసాగుతుండగానే కమెడియన్ పృథ్వీ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పృథ్వీ హై బీపీతో బాధపడుతున్నట్లు సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు పృథ్వీరాజ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కాగా మంగళవారం పృథ్వీరాజ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. వైసీపీకి, జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదన్నాడు. దీంతో వైసీపీ శ్రేణులు మరింత కోపోద్రిక్తులైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వేదికగా ఆయనపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న లైలా సినిమా రిలీజ్ కానుంద. మరి ఈ బాయ్ కాట్ ట్రెండ్ సినిమాపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో!
సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ..#PrudhviRaj #Laila #LailaTrailer #VishwakSen pic.twitter.com/xcT3g5HZkj
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 11, 2025