మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? లైట్ తీసుకోవద్దు, ఈ క్యాన్సర్ ఉన్నట్లే..?

divyaamedia@gmail.com
1 Min Read

ప్రోస్టేట్ క్యాన్సర్.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ కుంగదీస్తుంది క్యాన్సర్ మహమ్మారి. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కూడా కామన్ డిసీజ్ లా మారిపోయింది. చాలా మంది దీని బారిన పడుతున్నారు. కొంత మంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎలాగోలా బయట పడుతున్నారు. కానీ కొందరు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మూత్ర సమస్యలు.. క్యాన్సర్ పరిమాణం పెరిగేకొద్దీ అది మూత్రనాళంపై ప్రభావం చూపిస్తుంది.

మూత్రవిసర్జన సమయంలో తక్కువ ప్రవాహం లేదా తరచూ మూత్రవిసర్జన జరుగుతుంది. మూత్రంలో రక్తం లేదా వీర్యం రావడం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఎముక సమస్యలు.. క్యాన్సర్ మరెక్కడా వ్యాప్తి చెందకపోతే సంక్రమణ తర్వాత ఎముకలు వద్ద మొదలవుతుంది. దీని కారణంగా ఎముకలు పెలుసుగా మారతాయి. దీంతో అవి త్వరగా విరిగిపోతాయి. తుంటి, వీపు వెనుక ప్రాంతంలో కత్తితో పొడిచినట్లుగా అనిపిస్తుంది.

శ్వాస సమస్యలు.. ఇది ప్రోస్టెట్ క్యాన్సర్ నాలుగో దశ. ప్రోస్టేట్ క్యాన్సర్ శోషరస గ్రంధులు, ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుంది. అలాగే పేరుకుపోయిన ద్రవం కారణంగా ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు మరింతగా పెరిగితే రోగులకు రక్తంతో దగ్గు వచ్చి ఊపిరితిత్తుల సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గడం.. అధికంగా బరువు తగ్గితే మాత్రం ప్రోస్టెట్ క్యాన్సర్ లక్షణం అని గుర్తించాలి.

కణితి అధునాతన దశకు చేరుకున్నప్పుడు ఆకలి లేకపోవడం, బలహీనత, బరువు తగ్గడం వంటి సమస్యలకు కారణం అవుతుంది. పేగు కదలికల్లో సమస్యలు.. క్యాన్సర్ పురుష నాళానికి వ్యాపించినప్పుడు రోగులు పేగు కదిలికల్లో కంట్రోల్ కోల్పోతారు. తీవ్రమైన కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తస్రావం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *