అర్ధరాత్రి ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసిన స్టార్ డైరెక్టర్, అసలు గొడవ ఏంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో ప్రకాష్ రాజ్ కు అనుబంధం ఉంది. ఆయనతో చాలా చనువుగా ఉండే అతికొద్దిమందిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. అయితే స్టార్ డైరెక్టర్ కాకముందే.. ప్రకాష్ రాజ్ తో త్రివిక్రమ్ కు పరిచయం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. త్రివిక్రమ్ ఇండస్ట్రీలో రైటర్ గా అడుగు పెట్టకముందే ప్రకాష్ రాజ్ తో చాలా క్లోజ్ గా ఉండేవారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్, సునిల్ బ్యాచిలర్స్ గా ఒక రూమ్ లో ఉండే రోజుల్లో.. ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి నానా హంగామా చేసేవారట. ఈ విషయాన్ని మాటల మాత్రికుడు ఓ సినిమా ఈవెంట్ లో వెల్లడించాడు. ప్రకాష్ రాజ్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ” అందరు ప్రకాష్ ను చూసి భయపడుతుంటారు… ఆయనతో పనిచేయడం చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతుంటారు. కానీ నా విషయంలో అలా కాదు.. నన్ను చూసి ఆయన భయపడుతుంటారు.

ఎప్పడు వాళ్ల ఇంటికి వెళ్లినా.. ఏదో ఒకటి పట్టుకెళ్తుంటాడు అని.. అది కూడా ఇప్పుడు కాదు నేను రైటర్ ను అవ్వకముందే .. నేను సునిల్ బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి డోర్ కొట్టి తింటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగి టార్చర్ చేసేవాళ్లం. ఆయన చేతికున్న వాచ్ నచ్చితే లాక్కొవడం, ఇంటి నుంచి మందుబాటిళ్లు పట్టుకెళ్లడం.. చాలా దౌర్జన్యం చేసేవాళ్ల.. ఆయన మమ్మల్ని చాలా భరించాడు. నన్ను మాత్రమే కాదు సునిల్ ను కూడా.. మా ఇద్దరిని భరించాడు పాపం..

మరి కావాలని భరించాడా.. లేక మా అల్లరిని ఎంజాయ్ చేశాడా తెలియదు కానీ.. మేము ఎప్పటికైనా ఏదో ఒకటి అవుతాము.. సాధిస్తాము అని నమ్మిన వ్యక్తి ప్రకాష్. అందుకే ఆయనతో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం.. ఇబ్బందిగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు” అని అన్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు.. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది.

మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ , అల్లు అర్జున్ తో సినిమాచేయాలని త్రివిక్రమ్ ప్రయత్నించినా.. వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది. వెంకటేష్ తో తన మార్క్ మూవీ చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు. నువ్వునాకు నచ్చావ్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు.. ఇక మరోసారి వీరి కాంబోలో కడుపుబ్బా నవ్విస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *