ప్రభాస్ ముగ్గురు చెల్లెల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌కి సొంత చెల్లెలు లేరు. కానీ కృష్ణంరాజు కుమార్తెలు అయిన ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలను సొంత చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభాస్ ప్రమేయం ఉంటుందని అంటారు. అయితే తాజాగా ఒక పెళ్లి వేడుకలో ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించడం.
బంధువుల పెళ్లి వేడుకకు ప్రభాస్ పెద్దమ్మతో శ్యామల దేవితో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా హాజరయ్యారు. భాగంగా అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం పెళ్లి వేడుక ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ప్రభాస్ అభిమానులు లైక్స్ షేర్ల వర్షం కురిపించారు. ‘ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
దీంతో మరోసారి నెట్టింట ప్రభాస్ పెళ్లిపై చర్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. ముందుగా ‘దిరాజా సాబ్’, విడుదల కానుంది. ఆ తర్వాత హను రాఘవపడి పౌజి సినిమా, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ‘సాలార్ 2’ ,కల్కి 2 సినిమాలు చేయనున్నాడు. కాగా ఇటీవల హోంబాలే నిర్మాణ సంస్థలో మూడు సినిమాల్లో నటించేందుకు ప్రభాస్ ఒకే చెప్పాడు.