రాజాసాబ్ లో నటించిన ఈ బ్యూటీలకు ఎంత రెమ్మ్యూనరేషన్స్ ఇచ్చారో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. భారత్‌లో తొలి రోజు సుమారు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా అత్యధికంగా ఉంది. అయితే రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్ రూ. 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ రూ.5-6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా హీరోయిన్లు మాళవిక మోహనన్ రూ.2 కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం. ప్రభాస్‌తో మాళవిక స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం ఆమెకు రూ.1.2-1.5 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మూడో హీరోయిన్‌ రిద్ధి కుమార్ ఏకంగా రూ.3 కోట్ల ఫీజు తీసుకున్నట్లు టాక్. ఇది ప్రభాస్ కెరీర్ లోనే తొలి హారర్ మూవీ కావడం విశేషం. ఉమైర్‌ సందు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ప్రకారం చూస్తే ఇది పైసా వసూల్‌ మూవీ అని తెలుస్తోంది. ప్రభాస్ తన నటనతో, స్క్రీన్ ప్రజెన్స్ తో వెండితెరపై మెస్మరైజ్ చేస్తారని తెలిసింది.

ఆయన పాత్రనే సినిమాకి బిగ్ హైలైట్‌ అని, ఈ రోల్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా సంజయ్‌ దత్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందట. నిధి అగర్వాల్‌ చాలా క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంటుందట. ప్రభాస్‌- సంజయ్‌ దత్‌ సీన్లు థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఉంటాయని సమాచారం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *