Pooja Hegde Once Again Getting Offers In Film Industry

Pooja Hegde Once Again Getting Offers In Film Industry

Pooja Hegde: కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??

ఏళ్ళ నాటి శని అంటారు కదా  ఇప్పుడు పూజా హెగ్డేను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అరే.. రెండేళ్లైంది ఈమెను కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు  కమిటైన సినిమాలు ముందుకు పోవట్లేదు.

ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్తుందసలు..? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా..? పూజా బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టే టైమ్ వచ్చిందా లేదా..? ఈ జిగేల్‌లన్నీ ఒకప్పుడే.. ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్‌లో చెప్పుకోడానికి..! వరసగా ఫ్లాపులు వస్తే పాపం ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? ఈ ప్రభావం ఇప్పుడు పూజా కెరీర్‌పై బలంగా పడింది.

ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం నుంచి వాళ్లు తీసేస్తే.. జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్యే నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. దాంతో పాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ పూజాకి వచ్చినట్లు తెలుస్తుంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కలయికలో రానున్న సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారు. షాహిద్ కపూర్ దేవా మినహాయిస్తే.. బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డేకు పెద్దగా ఆఫర్స్ లేవు.

తెలుగులో ఒక్కటి.. తమిళంలో ఒక్కటి అంటూ అరకొర ఆఫర్స్‌తో కెరీర్ నెట్టుకొస్తున్నారు ఈ బ్యూటీ. పూజా కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అది జరగాలంటే ముందు ఒప్పుకున్న సినిమాలు విడుదలై విజయం సాధించాలి. అప్పటి వరకు ఈ భామకు బ్యాడ్ టైమ్ తప్పదు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి