Free Bus In Ap For Women When Will It Start Know Latest Update

Free Bus In Ap For Women When Will It Start Know Latest Update

AP Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బసు ప్రయాణం.. చంద్రబాబు కీలక ప్రకటన?

తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆడ వారు ఉచితంగానే ఇప్పుడు బసుల్లో ప్రయాణం చేస్తున్నారు. కర్నాటకలో ఈ స్కీమ్ మొదటిగా అమలులోకి వచ్చింది. తర్వాత దీన్ని తెలంగాణలో అందుబాటులోకి తెచ్చారు.

ఇక ఇప్పుడు ఈ ఉచిత బసు ప్రయాణం ఏపీలో కూడా అమలులోకి రాబోతోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూడా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే బస్‌లో జర్నీ చేయొచ్చు.

చంద్ర బాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత బస్ ప్రయాణం హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉచిత బస్ ప్రయాణంపై కీలక ప్రకటన ఉండొచ్చని సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.

తెలంగాణ, కర్నాటకలో మాదిరిగా గానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులో ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏపీఎస్ఆర్‌టీసీ ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం స్కీమ్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో కూడా సరిపోతుందనే అంచనాకు ఏపీఎస్ఆర్‌టీసీ అధికారులు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్కీమ్‌ అమలుపై పలు అంశాలలో స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త జిల్లాల పరిధిలోపే ఉచిత బస్ ప్రయాణానికి పరిమితి ఉంటుందా. లేదంటే ఉమ్మడి జిల్లాల పరిధికి ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తారా? లేదంటే రాష్ట్రమంతా ఉచిత బస్ జర్నీ చేసే వెసులుబాటు ఉంటుందా? అనే అంశం తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఉచిత బస్ ప్రయాణంపై ఆంక్షలు వస్తే మాత్రం ప్రభుత్వంపై మహిళలు వ్యతిరేకత చోటుచేసుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

కాగా మరోవైపు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో ఈ స్కీమ్‌ను అమలు చేసే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి దాకా ఈ స్కీమ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. రానున్న రోజుల్లో పూర్తి అంశాలు వెల్లడి కానున్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి