వామ్మో.. మూవీస్ లోకి వచ్చి పూజా హెగ్డే ఎన్ని కోట్లు ఆస్తి సంపాదించిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

నటీమణులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని ఫాలో అవుతున్నారు. చేతినిండా సినిమాలు ఉన్న టైంలోనే ఆస్తులు పోగేసుకుంటున్నారు. పూజా హెగ్డే ఆస్తుల గురించి సంచలన విషయాలు బయటకి వచ్చాయి. అయితే పూజా హెగ్డే అటు బాలీవుడ్‌, ఇటు సౌత్ సినిమాల్లో సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే స్టార్‌ హీరోలతో కలిసి నటించే ఛాన్స్‌లు కొట్టేసింది. తెలుగులో జూనియన్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్, అల్లు అర్జున్‌ వంటి యంగ్‌ హీరోలకు జోడీగా చేసింది. హిందీలో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. టాప్‌ హీరోలతో పని చేసినా, ఆమె కెరీర్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు.

ఇటీవల పూజా హెగ్డే బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌తో ‘చాక్లెట్ బాయ్’ సినిమా చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇది కూడా బాక్సీఫీస్‌ వద్ద ఫ్లాప్ అయింది. పూజా హెగ్డే యాక్టింగ్‌ కెరీర్‌, మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హీరో మూవీ ‘మూగమూడి (2012)’తో ప్రారంభమైంది. ఇందులో హీరో జీవాకు జోడీగా నటించింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. 2014లో సింధు లోయ నాగరికత నేపథ్యంలో తెరకెక్కిన ‘మొహెంజొదారో’ మూవీలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌తో నటించే అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలో కలిసి నటించినా పూజాకి హిట్‌ దక్కలేదు. ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించిన ‘దేవా’ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. అయినా ఫెయిల్యూర్‌ తప్పలేదు. గత సంవత్సరం ఆమె సల్మాన్ ఖాన్ భారీ బడ్జెట్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ లో యాక్ట్‌ చేసింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. పూజా మొదట సుకుమార్‌- రామ్‌ చరణ్‌ మూవీలో చేసిన ‘జిగేలు రాణి’ ఐటమ్‌ సాంగ్‌తో సూపర్‌ పాపులర్‌ అయింది. అంతకు ముందు ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2018లో త్రివిక్రమ్‌- జూ.ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత వీర రాఘవ’తో హిట్‌ అందుకుంది.

ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌తో ‘గద్దల కొండ గణేష్‌’, అల్లు అర్జున్‌తో ‘అలా వైకుంఠ పురంలో’ హిట్ అయ్యాయి. 2021లో ప్రభాస్‌తో యాక్ట్‌ చేసిన పాన్‌ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’ నిరాశపరిచింది. ఆ తర్వాత పెద్ద ప్రాజెక్ట్‌లు బీస్ట్‌, ఆచార్య కూడా ఫ్లాప్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘రెట్రో’, ‘జన నాయగన్’, ‘కాంచన 4’ ఉన్నాయి. 2021లో సౌత్ సినిమాలో ఫోర్బ్స్ ఇండియా రిలీజ్‌ చేసిన మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ స్టార్స్‌ లిస్టులో పూజా 7వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. కొన్ని నివేదికల ప్రకారం ఆమె నెట్‌ వర్త్‌ దాదాపు రూ.50 కోట్లు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *