అక్కినేని హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం , మజిలీ, బంగార్రాజు మరికొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అక్కినేని హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రేమకథలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద నాగ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు.
అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగ్. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటు వరుస సినిమాలతో నాగార్జున బిజీగా ఉండగా.. ఆయన వారసులు సైతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తండేల్ సినిమాతో రికార్డ్ సృష్టించారు అక్కినేని నాగచైతన్య.
తండేల్ సినిమాతో నటుడిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చైతూ. మరోవైపు హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు అఖిల్. కానీ కెరీర్ మొదటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్, చైతూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం సిద్ధమవుతున్నారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె.
నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. అయితే నాగార్జునతో కలిసి మూవీ కాకుండా ఓ యాడ్ చేసింది పూజా. అలా ముగ్గురు అక్కినేని హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.