సినీ నటుడు మంచు మనోజ్ పేరు గత కొంతకాలంగా బాగా వినిపిస్తోంది. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా రోడ్డెక్కిన ఈహీరో ఇప్పుడు మళ్లీ పోలీస్‌లపై తన అనుమానం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి హల్‌చల్ చేసిన వార్త దుమారం రేపుతోంది. మంచు మనోజ్ సోమవారం రాత్రి భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు రావడం కలకలం రేపింది. భాకరాపేట ఘాట్ రోడ్డులో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్ మనోజ్ కుమార్ బస చేశారు.
అయితే తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. భాకారాపేట సమీపంలో ఒక రిసార్ట్ లో బస చేసిన మంచు మనోజ్ వద్దకు వెళ్ళారు ఎస్ఐ రాఘవేంద్ర.
నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న రిసార్ట్ లో మనోజ్ వద్దకు వెళ్లి ఇక్కడెందుకు ఉన్నారని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే పోలీసులకు, మంచు మనోజ్ మధ్య వాగ్వివాదం జరిగింది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారంటూ ఆరోపించారు మనోజ్. తనే పోలీస్ స్టేషన్ కు వస్తానని వెళ్లి స్టేషన్ ముందు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు మంచు మనోజ్.
రాత్రి పట్రోలింగ్ లో భాగంగానే రిసార్ట్ దగ్గరకు వెళ్ళామంటున్నారు పోలీసులు. మంచు మనోజ్ ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళామని మనోజ్ ను ఏమీ అడగలేదంటున్నారు పోలీసులు.