Pawan Kalyan: ఇష్టం లేకపోయినా నాగబాబు అప్పులు తీర్చడానికి ఆ రెండు సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తన విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలను కూడా కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. దీనికి సీక్వెల్ గా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Also Read: 50 ఏళ్ల వయసులో కొత్త బాయ్ ఫ్రెండ్ను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.
గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ ఇష్టం లేకపోయినా ఆర్థిక సమస్యల కారణంగా చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గతంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్ దబంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ మూవీ చేశాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ సినిమాకు భారీగా మార్పులు చేసి గబ్బర్ సింగ్ తెరకెక్కించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఆయన భారీగా లాభపడ్డాడు.
గబ్బర్ సింగ్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు పవన్ కళ్యాణ్. హిట్ ట్రాక్ ఎక్కాడు. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కింది. కే ఎస్ రవీంద్ర ఈ చిత్ర దర్శకుడు. పవన్ కళ్యాణ్ కథను సమకూర్చడం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం నిరాశ పరిచింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలను పవన్ కళ్యాణ్ కేవలం డబ్బుల కోసమే చేశాడట. అన్నయ్య నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నాడట.
Also Read: కృష్ణంరాజుని తొక్కేసేందుకు అప్పుడు భారీ కుట్రలు చేసిన దర్శక, నిర్మాత. ప్రభాస్ తండ్రి రంగంలోకి రావడంతో..!
దాని కోసం ఒక చిత్రం చేశాడట. అలాగే ఫైనాన్సియర్స్ కి డబ్బులు చెల్లించాల్సి ఉండగా… త్వరగా పూర్తి అయ్యే ఒక సినిమా చేయాలని మరొక చిత్రం చేశాడట. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ చిత్రాలు నేను ఇష్టపడి చేయలేదు. కేవలం ఆర్థిక ఇబ్బందులను బయటపడాలనే చేశానని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాగా, గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.