డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్‌కు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. నాటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు . వరుస రివ్యూలతో పాటు వాటికి అనుగుణంగా ఆదేశాలిస్తూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాంటే సినిమాలలో నటించినంత తేలిక కాదు. పూలు పడిన చోటే రాళ్లు పడుతుంటాయి.. ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
దీంతో ఆయన ప్రతిపక్షంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది.ఏపీ మాజీ ముఖ్యమంత్రి సైతం తనకు కొన్ని వర్గాల నుంచి ముప్పు ఉందని తెలపడంతో ఆయనకూ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. అయితే గత ప్రభుత్వం పడిపోవడానికి పవన్ కూడా కారణమని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకు వివిధ వర్గాల నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పవన్ విషయంలో కుట్రలు పన్నుతున్నారని, ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని నిఘా వర్గాలు తెలిపారు.
పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ప్రధాని పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోదీ పవన్ ను ప్రత్యేకంగా ‘తుఫాన్ ‘ అంటూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను రక్షించుకోవాల్సి బాధ్యత ఉందని భావిస్తున్నారు. అందుకే పవన్ విషయంలో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిఘా వర్గాలు పవన్ కు ఉన్న ముప్పును పసిగట్టినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష హోదాలో ఉన్న సమమయంలో పవన్ కల్యాణ్ నిత్యం ప్రజల్లోనూ ఉంటూ గడిపారు. ఇప్పుడు అధికారంగా మరిన్ని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పవన్ కు భద్రత విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అసక్తిగా ఎదురుచూస్తున్నారు.