Pataleshwar Mahadev: ఈ ఆలయంలో చీపురు సమర్పిస్తే చాలు, ఆ రోగాలు వెంటనే తగ్గిపోతాయి.

divyaamedia@gmail.com
2 Min Read

Pataleshwar Mahadev: ఈ ఆలయంలో చీపురు సమర్పిస్తే చాలు, ఆ రోగాలు వెంటనే తగ్గిపోతాయి.

Pataleshwar Mahadev: అన్ని దేవాలయాలకు దాని సొంత కథ ఉంటుంది. కొన్ని దేవాలయాలలో జరిగే అద్భుతాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు కొన్ని రహస్య దేవాలయాలు ఉన్నాయి. వాటి రహస్యాలు ఇప్పటి వరకు ఎవరూ వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో పురాతన పాతాలేశ్వర్ శివాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారు. పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు.

Also Read: భారతదేశంలోని ఈ గ్రామంలో మహిళలు బట్టలు లేకుండా ఉంటారు.

ఈ ఆలయంలో శివునికి చీపురు సమర్పించడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. చీపురు సమర్పించడం ద్వారా భగవంతుడు భోలేనాథ్ సంతోషిస్తాడని., అలా చేయడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు.ఇక్కడ చీపురు సమర్పించే సంప్రదాయం కూడా చాలా పాతది. శివునికి చీపురు సమర్పించేందుకు ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలబడతారు. అంతేకాకుండా వందలాది మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు.

Also Read: ఈ చిన్న తప్పు చేస్తే మీ సిమ్‌ కార్డు 6 నెలల వరకు పొందలేరు.

ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుండి ఈ ఆలయం గురించి చర్మవ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ చీపురు సమర్పించాలని చెబుతారు. దీంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. అందుకే నేటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకుంటారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *