పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్, దీంతో వెల్లువెత్తుతున్న విషెష్.

divyaamedia@gmail.com
1 Min Read

బాలీవుడ్ హీరోయిన్ సోనారికా బడోరియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తన భర్త వికాస్ పరాశర్‌తో కలిసి తమ జీవితంలోకి చిన్నారిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మా మధురమైన అత్యంత గొప్ప ఆశీర్వాదం. ఇప్పటికే మా ప్రపంచం మొత్తం ఆమెనే’ అంటూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ కపు‌ల్‌కు విషెష్ చెబుతున్నారు.

సోనారికా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి బేబీ బంప్ ఉన్న ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. బీచ్ ఒడ్డున ప్రకృతి సోయగాల మధ్య తాము పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా… వీరికి ఆడబిడ్డ జన్మించింది. సోనారిక 2024లో ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.

అంతకు ముందు ప్రేమలో ఉన్న వీరు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలో బిజీగా మారారు. తాజాగా పేరెంట్స్ అయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే… సోనారిక తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే, హిందీ సీరియళ్లలోనూ తన నటనతో లక్షలాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు.

2011లో ‘తుమ్ దేనా మేరా సాత్’ షోతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె… ‘డెవోన్ కె దేవ్… మహాదేవ్’లో పార్వతీ దేవిగా అద్భుతంగా నటించారు. ఆదిశక్తి, పార్వతీ దేవి, దుర్గాదేవిగా ఆమె పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *