పక్షవాతం వచ్చే ముందు మీ శరీరంలో కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే. మీరు నిర్లక్ష్యం చేసారో..?

divyaamedia@gmail.com
2 Min Read

పక్షవాతం మనకు చెప్పకుండా రాదు. కొన్ని లక్షణాలను మనకు చూపిస్తూ వస్తుంది. ఇక ఆ లక్షణాలను గురించి తెలుసుకుంటే పక్షవాతం రావడానికి ముందు తగిన జాగ్రత్త తీసుకునే వీలు ఉంటుంది. పక్షవాతం రావటానికి ముందు ఒక వైపు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో వేగంగా మారుతున్న జీవన విధానంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులకే పరిమితమైన పక్షవాతం (స్ట్రోక్) సమస్య ఇప్పుడు యువతను కూడా ప్రభావితం చేస్తోంది. పక్షవాతం అంటే శరీరంలోని కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం. ఇది మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో వచ్చిన సమస్యల వల్ల తలెత్తుతుంది.

దీనివల్ల శరీరం ఒక్కసారిగా దెబ్బతింటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ఒక వైపు చేయి, కాలు, నోరు, కన్ను ప్రభావితమవుతాయి. పక్షవాతాన్ని సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. ఇది మెదడులో రక్తస్రావం లేదా రక్తనాళాల్లో అడ్డంకుల వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో బ్లాకులు ఏర్పడటం వల్ల పక్షవాతం సంభవిస్తుంది. నివేదికల ప్రకారం.. 85 శాతం పక్షవాతం కేసులు రక్తనాళాల బ్లాక్ వల్లనే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం ప్రమాదంలో ఉన్నవారికి కొన్ని లక్షణాలు ముందుగా కనిపించే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్నిసార్లు చిన్న పక్షవాతం (TIA) లక్షణాలు ముందుగానే తెలుస్తాయి.

మాట్లాడటంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, లేదా శరీరంలోని ఒక భాగం తాత్కాలికంగా బలహీనపడడం వంటి చిన్న లక్షణాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితిని పక్షవాతానికి ముందస్తు సంకేతంగా పరిగణించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో అవసరం. పక్షవాతం వచ్చినప్పుడు ప్రధానంగా శరీరంలోని ఒక వైపున ఎక్కువ ప్రభావం ఉంటుంది. రోగి నడవడం, మాట్లాడటం, వ్రాయడం, లేదా శరీరాన్ని కదలించడం కష్టమవుతుంది. కంటి చూపు తగ్గిపోవడం, లేదా శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా పనికిరాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే వైద్య సహాయం పొందేలా చూడాలి.

పక్షవాతాన్ని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవడం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను విడిచిపెట్టడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులు పాటించడం మంచిది. పక్షవాతం అనే సమస్య తీవ్రంగా ఉంటే కూడా.. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం, లక్షణాలను గుర్తించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కనీసం అనుమానస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభం. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం వల్ల పక్షవాతాన్ని చాలా వరకు నివారించవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *