పరాగ్ త్యాగి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని భార్య, ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (41) అకస్మాత్తుగా కన్నుమూసింది. ‘కాంటా లాగా’ పాటతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన షెఫాలీ మరణం సినీ పరిశ్రమను షాక్కు గురి చేసింది. అయితే ఇటీవల పరాగ్ త్యాగి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
అతని భార్య ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తుగా కన్నుమూసింది. హిందీ సాంగ్ ‘కాంటా లాగా’ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ఆమె మరణం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. అయితే షెఫాలీ మరణంపై చాలా రూమర్లు వచ్చాయి. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే నటి చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షెఫాలీ జరీవాలా మరణంపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు ‘దేవుడు ఎక్కడ ఉంటాడో, అక్కడ దెయ్యం కూడా ఉంటుంది. నేడు ప్రజలు తమ బాధల కంటే ఇతరుల ఆనందం, సంతోషాన్ని చూసే ఎక్కువ బాధ పడుతున్నారు. నా భార్య పై ఎవరు చేతబడి చేశారో నాకు తెలుసు. కానీ, నేను చెప్పలేను. ఏదో తప్పుగా ఉందని, జరిగిందని నేను భావిస్తున్నాను. ఒకసారి కాదు, రెండుసార్లు మాపై చేతబడి జరిగింది.
ఒకసారి బయటపడ్డాము. కానీ, రెండో సారి అది కొంచెం భారీగా చేశారు. ఏమి జరిగిందో నాకు తెలియదు’ అని పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
