Paracetamol: పారాసెటమాల్ వాడుతున్నారా..! అయితే తిప్పలు తప్పవు!

divyaamedia@gmail.com
2 Min Read

Paracetamol: పారాసెటమాల్ వాడుతున్నారా..! అయితే తిప్పలు తప్పవు!

Paracetamol: పారాసెటమాల్ వాడుతున్నారా..! అయితే తిప్పలు తప్పవు!పారాసెటమాల్..దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి , ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు , ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టీరాయిడ్లతో కాని వాపు తగ్గించే మందులతో , ఒపియాయ్ద్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు.

అయితే పాపులర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ సారిన్ మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ ఇంకా లండన్‌లో చాలా మంది కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి పారాసెటమాల్ విషం అని చెప్పారు.ముఖ్యంగా కోవిడ్ తర్వాత, పారాసెటమాల్‌ను ఎక్కువగా నొప్పి నివారిణిగా ఉపయోగిస్తున్నారు. డాక్టర్ శివ్ కుమార్ సరిన్ ఒక రోజులో కేవలం 2 పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Also Read : ఈ లడ్డూలు తరచూ తింటుంటే చాలు, మీ జుట్టు రాలడం ఆగిపోవాల్సిందే..!

ఎక్కువగా తీసుకుంటే కాలేయం సమస్య రావడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే కాలేయం అనేది పక్కటెముక క్రింద, ఉదరం కుడి వైపున ఉండే ఒక చిన్న అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి, విషాన్ని వదిలించుకోవడం వరకు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్ధారించడం వరకు పనిచేస్తుంది.పారాసెట్మాల్ ఎక్కువగా వాడకం వల్ల మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్లూటథియోన్ అనే సబ్ స్టాన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు, శరీరానికి కావాల్సిన ప్రొటీన్, కెమికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. అయితే ఇది మద్యం సేవించే వాళ్లు.. ఒబేసిటీ ఉన్న వారిలో తక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఎక్కువగా పారాసెట్మాల్ వాడే వారిలో లివర్ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సరిన్ స్పష్టం చేశారు.

Also Read : ఈ చిన్న పని చేస్తే చాలు, మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు.

లివర్ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుందట. మనం ఒక రోజులో రెండు, మూడు సార్లు పారాసెట్మాల్ వాడాలి అంటే అర ట్యాబ్లెట్ చొప్పున వాడుకోవాలని సూచిస్తున్నారు.ఒకవేళ కనుక మీరు పారాసెట్మాల్ ట్యాబ్లెట్ని ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితి వస్తే ఆ కేవలం వైద్యుని సలహా ప్రకారమే వాడాలని ఆయన సూచిస్తున్నారు. లేదంటే కచ్చితంగా అనారోగ్యాల పాలవ్వడం ఖాయం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *