రోడ్డు పక్కన పానీపూరీ లొట్టలేసుకుని తింటున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి.

divyaamedia@gmail.com
2 Min Read

స్ట్రీట్ ఫుడ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం కలుషితానికి గురైన ఆహారం తిన్నా రోగాలు చుట్టు ముడతాయి. ముఖ్యంగా పానీపూరిల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నచిన్న పట్టణాలు, మారుమూల పల్లెల్లో పానీపూరి విక్రయిస్తున్నారు.

పానీ పూరీ బండ్ల వద్ద వినిపించే ‘భయ్యా తోడా ప్యాజ్ దాలో’ అనే పదం ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. దీన్నిబట్టే పానీపూరీ ఎంత ఫేమస్సో అర్థమవుతుంది. అయితే ఈ పానీపూరీని ఎలా తయారుచేస్తారో చూస్తే మాత్రం ఇక మీ జీవితంలో పానీపూరి తినాలంటే భయపడిపోతారు. తినడం కాదుకదా పేరెత్తడానికి కూడా వణికిపోతారు. ఇలాంటి పానీపూరి తయారీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా మజిగవాన్ బజార్ ప్రాంతానికి చెందిన అన్షు, రాఘవేంద్ర పానీ పూరీ వ్యాపారం చేస్తున్నారు. వారే పెద్ద మొత్తంలో పానీ పూరీని తయారు చేస్తారు. తాజాగా వీరిద్దరూ పానీ పూరీని ఎలా తయారు చేస్తారో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పానీ పూరీ చేయడానికి పిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించారు. ముందుగా పానీపూరీ తయారీ కోసం పిండిని సిద్ధం చేస్తున్నారు. పిండిని నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ అత్యంత జుగుప్సాకరంగా చేస్తున్నాడు.

అలాగే టేస్ట్ కోసం ఈ పిండిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించారు. ఇందులో బాత్రూం క్లీనింగ్ కోసం ఉపయోగించే హార్పిక్, పంటకు వేసే యూరియా కూడా వేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పానీపూరీ తయారుచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *