వామ్మో, ఛీఛీ.. ఇదేం పాడు పని, పని మనిషి వీడియో వైరల్!

divyaamedia@gmail.com
2 Min Read

గత కొంత కాలంగా ఇంట్లో కూరగాయలు, వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో ఇంటి యజమాని ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేసి వెళ్లిపోయాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత వీడియో చూస్తే కళ్లు బైర్లు గమ్మే విజువల్స్ బయటపడ్డాయి. పనిమనిషి వంట వండేందుకు వచ్చి.. ఓ పాత్ర తీసుకొని ఆ పాత్రలో తాను మూత్రం పోసింది. అదే పాత్రలో పిండి పిసికి రోటీలు చేసింది. ఆ రోటీలనే పిల్లలకు అల్పాహారంగా వడ్డించింది. పూర్తీ వివరాలోకి వెళ్తే ఓ రియల్‌ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రికార్డయిన ఈ వీడియోను చూసి పనిమనిషిని నానా తిట్లు తిడుతున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఏం చేసిందంటే.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గత 8 ఏళ్లుగా వంట చేస్తోంది.

నమ్మకస్తురాలే కదా అని ఆమెను ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇంట్లో కూరగాయలు, వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో ఇంటి యజమాని ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేసి వెళ్లిపోయాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత వీడియో చూస్తే కళ్లు బైర్లు గమ్మే విజువల్స్ బయటపడ్డాయి. పనిమనిషి వంట వండేందుకు వచ్చి.. ఓ పాత్ర తీసుకొని ఆ పాత్రలో తాను మూత్రం పోసింది. అదే పాత్రలో పిండి పిసికి రోటీలు చేసింది. ఆ రోటీలనే పిల్లలకు అల్పాహారంగా వడ్డించింది. వీడియోను చూసిన తర్వాత ఇంటి యజమానికి క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పనిమనిషి కూడా నేరాన్ని అంగీకరించింది. పనిమనిషి గత ఎనిమిదేళ్లుగా తన ఇంట్లో ఆహారం వండుతోందని బాధిత వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇంట్లోని వంటగదిలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు, ఇతర వస్తువులు పోతున్నాయి. దీంతో పనిమనిషిపై అనుమానం వచ్చి ఆమె వచ్చేలోపు మొబైల్ కెమెరా స్విచ్ ఆన్ చేసి వంటగదిలో దాచిపెట్టాడు. పనిమనిషి పని ముగించుకుని వెళ్లిన తర్వాత కెమెరాలో రికార్డయిన వీడియో చూశారు.

వీడియోలో పనిమనిషి బాగోతం బయటపడడంతో స్కూల్‌కు వెళ్తున్న పిల్లలకు ఫోన్‌ చేసి ఆ ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. మహిళ తొలుత తనకేం తెలియదని బుకాయించింది. అయితే ఆమెకు వీడియో చూపించి ప్రశ్నించగా తన నేరాన్ని అంగీకరించింది. అయితే దీనికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు. మరోవైపు, ఈ మహిళ తన మూత్రంతో చేసిన ఆహారాన్ని వారికి ఎంతకాలం తినిపించిందో తనకు తెలియదని వ్యాపారవేత్త చెప్పాడు. ఆమె చర్యల కారణంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కాలేయం దెబ్బతిందని ఆయన అన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *