హీరోయిన్లు తమ అదృష్టని పరీక్షించుకుంటున్నారు.. అందులో కొంతమంది మాత్రమే భారీ క్రేజ్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది. సినిమాల్లోకి అడుగు పెట్టే కంటే ముందే మోడల్గా రానుంచి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లోప్రగ్యా జైస్వాల్ ఒకరు.
డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది. సినిమాలతో పాటు చాలా యాడ్స్ లోనూ నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. రీసెంట్ గా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పార్టీలో కనిపించింది.
ఆమెను చూడగానే ఫోటో గ్రాఫర్స్ ఒక్కసారిగా ఆమెను ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. దాంతో ఆమె కాస్త చిరాకు పడింది. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. అయితే నెటిజన్స్ ప్రగ్య పై ఫైర్ అవుతున్నారు. అలాంటి డ్రస్ వేసుకోవడం ఎందుకు ఫోటోలు తీస్తే ఇబ్బంది పడి ఫోటోగ్రాఫర్స్ పై చిరాకు పడటం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల తార. తన అందాలతో కుర్రకారు మతిపోగోడుతుంది.