ఇక ఓయో రూమ్స్‌కి వెళ్లే జంటలకు వారికి పండగలాంటి వార్త, ఓయో కంపెనీ ఏం చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఐపీవోకు వెళ్లడానికి ముందు ఓయో మాతృసంస్థ ఒరావెల్‌ స్టేస్‌ పేరును మార్చాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పేరును సూచించాలని ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీని పెట్టింది. ఇందులో ఆరు వేలకుపైగా సూచనలు వచ్చాయి. అయితే బడ్జెట్ హోటల్స్ అంటే గుర్తొచ్చే ఓయో ఇప్పుడు లగ్జరీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఓయో పేరెంట్ కంపెనీ ‘ప్రిజం’ ప్రీమియం హోటల్స్, లగ్జరీ విల్లాలు, ప్రత్యేకమైన ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ‘చెక్ఇన్’ అనే సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు బడ్జెట్ ప్రయాణికుల అవసరాలను ఓయో యాప్ తీరుస్తూ వచ్చింది.

అయితే ఇప్పుడు కంఫర్ట్, స్టైల్, బెస్ట్ సర్వీసెస్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని స్పెషల్ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌కి గ్యారెంటీ.. చెక్ఇన్ యాప్‌లో కనిపించే ప్రతి హోటల్, హోమ్‌స్టే ఎన్నో నాణ్యతా ప్రమాణాల ను పాటిస్తుంది. ఇందులో సండే హోటల్స్ , క్లబ్‌హౌస్, పాలెట్ వంటి ప్రముఖ బ్రాండ్లతో పాటు, యూరప్‌లోని లగ్జరీ హాలిడే హోమ్స్‌ అయిన చెక్‌మైగెస్ట్ , డాన్‌సెంటర్, బెల్విల్లా వంటివి కూడా ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులకు రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయని ప్రిజం ఫౌండర్, గ్రూప్ CEO రితేష్ అగర్వాల్ తెలిపారు.

ఒకటి గ్యారెంటీ క్వాలిటీ, రెండు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో వెతకాల్సిన పనిలేదు. బెస్ట్ ఆప్షన్లన్నీ ఒకేచోట లభిస్తాయి. భారత్‌వ్యాప్తంగా 1,300కు పైగా హోటళ్లతో, దేశంలోనే అతిపెద్ద ప్రీమియం హోటల్ చైన్‌గా మారడమే తమ లక్ష్యమని ‘చెక్ఇన్’ చెబుతోంది. ఈ కలెక్షన్‌లోని ప్రతి హోటల్‌ను నిపుణులైన బృందాలు నిర్వహిస్తాయి. దీనివల్ల శిక్షణ పొందిన సిబ్బంది, నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, శుభ్రమైన గదులు, కిమిరికా కిట్స్ వంటివి అన్నిచోట్లా ఒకేలా లభిస్తాయి. ఇందులో ‘టౌన్‌హౌస్’ బేసిక్ టైర్ కాగా, ‘సండే హోటల్స్’ ప్రీమియం విభాగంలో ఉంటాయి.

భారత్ నుంచి ప్రపంచానికి.. ఈ యాప్‌ను మొదట మూడు నెలల పాటు భారత్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో పరీక్షించారు. ఇప్పటికే లండన్, దుబాయ్, బాలి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రీమియం హోటల్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ సేవలు భారత్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే దీనిని ఇంటర్నేషనల్ మార్కెట్లకు కూడా విస్తరించనున్నారు. లగ్జరీ ప్రయాణాలకు దీన్ని ఒక గ్లోబల్ హబ్‌గా మార్చడమే వారి ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

మారుతున్న ప్రజలు, ప్రయాణికుల అభిరుచులు.. తాజాగా ఓయో హోటల్స్ చేసిన సర్వే ప్రకారం, ప్రయాణికుల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. సుమారు 45 శాతం మంది బడ్జెట్ హోటల్స్‌ను ఇష్టపడుతుంటే, దాదాపు 55 శాతం మంది మాత్రం అద్భుతమైన డిజైన్, ప్రత్యేకమైన అనుభూతిని అందించే నాణ్యమైన వసతుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికే చెక్ఇన్ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.

నిజానికి బడ్జెట్ ప్రయాణికుల అవసరాలు వేరు, లగ్జరీ కోరుకునే వారి అభిరుచులు వేరు. అందుకే ఈ రెండింటినీ వేరువేరు ప్లాట్‌ఫామ్స్‌పైకి తీసుకొచ్చారు. దీనివల్ల వినియోగదారులు ఎలాంటి గందరగోళం లేకుండా, తమకు కావాల్సిన దాన్ని సులభంగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *