చెన్నై రైలులో 80 ఏళ్ల వ్యక్తి స్వీట్లు అమ్ముతున్న దృశ్యాన్ని చూసి నా గుండె బద్దలైంది. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న అతని సొంత కుమార్తె అతన్ని వదిలేసింది. ఇప్పుడు అతను , అతని భార్య తమను తాము పోషించుకుంటున్నారు. 70 ఏళ్ల వయసున్న అతని భార్య కూడా ఇంట్లో స్వీట్లు తయారు చేస్తుంది. వాటిని ఈ వృద్ధుడు అమ్మడానికి బయలుదేరతాడు. ఈ వయసులో కూడా ఆత్మ గౌరవంతో బతకడానికి భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారు.
నేను తాతగారి దగ్గర స్వీట్స్ కొన్నా.. రుచి చూశాను… నన్ను నమ్మండి.. వాటి రుచి కేవలం తీపి కాదు.. స్వచ్ఛమైనది… ప్రేమతో నిండి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అతన్ని కలిస్తే.. స్వీట్లు లేదా పోలీలు మాత్రమే కొనకండి… అతని ధైర్యం, అతని పోరాటం , అతని అచంచలమైన ఆత్మగౌరవాన్ని కొనండి. మీరు సహాయం చేయాలనుకుంటే.. అతని నంబర్‌కు అతన్ని సంప్రదించి ఆర్డర్ ఇవ్వండి (చెన్నైలో లభిస్తుంది). కొన్నిసార్లు, ఆహారం రుచిని మాత్రమే కాదు… అది చెప్పలేని కథల భారాన్ని కూడా మోస్తుంది.
మన పెద్దలను చివరి దశలో ఒంటరిగా ఉండనివ్వకండి.. వారికి మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వడం పిల్లల బాధ్యత అని చెప్పాడు ప్రయాణీకుడు. ఈ పోస్ట్ పై ఒకతను స్పందిస్తూ.. అతను తన పనుల పర్యవసానాన్ని అనుభవిస్తున్నాడని ఒకరు.. చెన్నైలోని ఏ ప్రాంతంలో తాతగారు ఉంటారు.. నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నాను అని ఒకరు కామెంట్ చేస్తున్నారు.
మరొకరు కుమార్తెపై కేసు నమోదు చేయండి అని తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యూజర్లు ముంబైకి చెందిన వ్యక్తిలా అనిపిస్తున్నారని చెప్పారు. చాలామంది సహాయ చేస్తామని అంటున్నారు. తమ పిల్లల కోసం తమ డబ్బునంతా ఖర్చు చేసి.. తమ భవిష్యత్ కోసం ఏమీ ఆదా చేసుకోని పెద్దలకు.. ఈ తాతగారి జీవితం ఒక గుణపాఠం అని కొందరు అన్నారు.
Polis, Sweets & Tears behind every bite ❤️ 😭 “Today, my heart broke when I saw an 80-year-old got pushed into hardship. Abandoned by his own daughter who now lives in London, he has taken up selling sweets and polis on the busy trains of Chennai, to support himself and his… pic.twitter.com/6wpuOzpwwk
— Dr Mouth Matters (@GanKanchi) September 9, 2025